జిల్లా ఆసుపత్రిలో ఘనంగా గణపతి కర్ర పూజ
సూర్య పెద్దపల్లి ప్రతినిధి:
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గణపతి కర్ర పూజ కార్యక్రమాన్ని శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈనెల 14న గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్న నేపథ్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పుష్పాలు, పసుపు, కుంకుమ సమర్పించి, గణేష్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పూజ అనంతరం సిబ్బందికి ప్రసాదం పంపిణీ చేశారు.