BREAKING
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. బస్సులో మర్చిపోయిన రూ. 3 లక్షల నగదును ప్రయాణికుడికి అప్పగించిన కండక్టర్, డ్రైవర్ సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై చర్యలకు బాధితుడి ఆందోళన వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. రిపోర్టులు లేవంటూ గర్భిణికి నిరాకరణ.. అంబులెన్స్‌లోనే ప్రసవం నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి సభకు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా? లేడీ సూపర్‌స్టార్ మౌనం వెనుక అసలు నిజం ఏంటి? భోగాపురంలో అమానుషం.. బైక్ రిపేర్ డబ్బుల కోసం యువకుడి మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం.. ఐదుగురు అరెస్ట్ మహేంద్రగిరి వారాహి’ పెద్ద హిట్‌ కాబోతోంది: అఖిల్ అక్కినేని! అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న అమెజాన్ కార్గో ఫ్లైట్.. ఐదుగురు దుర్మరణం ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఆకట్టుకున్న తారల సందడి! ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్.. ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆసక్తి! తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. మరో రెండు రోజులు వానలు! సెప్టెంబర్ 7న వెండి ధరలు.. తెలంగాణ, ఏపీలో గ్రాము రేట్లు ఇవే! పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే! అట్టముక్కల వైద్యం....! రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు..

వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. రిపోర్టులు లేవంటూ గర్భిణికి నిరాకరణ.. అంబులెన్స్‌లోనే ప్రసవం

Select Suryaa Now
వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. రిపోర్టులు లేవంటూ గర్భిణికి నిరాకరణ.. అంబులెన్స్‌లోనే ప్రసవం

సూర్య హైదరాబాద్ డెస్క్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ఒక నిండు గర్భిణికి తక్షణ అత్యవసర వైద్యం అందించాల్సింది పోయి, వైద్య పరీక్షల రిపోర్టులు లేవంటూ ఆమెను చేర్చుకోకుండా వెనక్కి పంపిన అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేపింది. నొప్పులు భరించలేక ఆ మహిళ నరకయాతన అనుభవిస్తుండటంతో చేసేది లేక కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వాహనంలోనే ఆమె ప్రసవించింది. అదృష్టవశాత్తూ తల్లి, బిడ్డ సురక్షితంగా బయటపడటంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తీవ్రమైన ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని బంధువులు హుటాహుటిన వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది ఆమె పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో చేయించుకున్న వైద్య నివేదికలు మరియు కేస్ షీట్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామని నిర్దాక్షిణ్యంగా తేల్చిచెప్పారు. అత్యవసర స్థితిలో ఉన్న మహిళకు మానవతా దృక్పథంతో వైద్యం అందించాల్సింది పోయి, రాతపత్రాలు లేవంటూ అడ్మిషన్ నిరాకరించడంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే నగరంలోని మరో పెద్దాసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ ఎక్కించగా, వాహనం వేగంగా వెళ్తుండగానే నొప్పులు తీవ్రమై అంబులెన్స్‌లోనే కాన్పు జరిగింది.

పేద ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటువంటి బాధ్యతారాహిత్యం చోటుచేసుకోవడంపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి తల్లికో లేదా పుట్టిన బిడ్డకో ప్రాణాపాయం సంభవించి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారని బాధిత కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతూ నిలదీశారు. అత్యవసర సమయాల్లో నిబంధనల పేరుతో రోగులను వెనక్కి పంపే వైద్య సిబ్బందిపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.