BREAKING
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. బస్సులో మర్చిపోయిన రూ. 3 లక్షల నగదును ప్రయాణికుడికి అప్పగించిన కండక్టర్, డ్రైవర్ సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై చర్యలకు బాధితుడి ఆందోళన వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. రిపోర్టులు లేవంటూ గర్భిణికి నిరాకరణ.. అంబులెన్స్‌లోనే ప్రసవం నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి సభకు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా? లేడీ సూపర్‌స్టార్ మౌనం వెనుక అసలు నిజం ఏంటి? భోగాపురంలో అమానుషం.. బైక్ రిపేర్ డబ్బుల కోసం యువకుడి మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం.. ఐదుగురు అరెస్ట్ మహేంద్రగిరి వారాహి’ పెద్ద హిట్‌ కాబోతోంది: అఖిల్ అక్కినేని! అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న అమెజాన్ కార్గో ఫ్లైట్.. ఐదుగురు దుర్మరణం ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఆకట్టుకున్న తారల సందడి! ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్.. ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆసక్తి! తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. మరో రెండు రోజులు వానలు! సెప్టెంబర్ 7న వెండి ధరలు.. తెలంగాణ, ఏపీలో గ్రాము రేట్లు ఇవే! పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే! అట్టముక్కల వైద్యం....! రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు..

సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై చర్యలకు బాధితుడి ఆందోళన

Select Suryaa Now
సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై చర్యలకు బాధితుడి ఆందోళన

సూర్య క్రైమ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వ్యవహార శైలి తీవ్ర దుమారం రేపుతోంది. పిల్లలున్న వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక రచించాడంటూ నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకట్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్య కుట్రకు సంబంధించిన వీడియో కాల్ ఆధారాలు బయటపడటంతో గ్రామ పెద్దలు ప్రశ్నించగా, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఉల్టా బాధితుడితో పాటు పది మంది గ్రామ పెద్దలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారంటూ బాధితుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మైనర్ కుమార్తె పట్ల కూడా సదరు రిపోర్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సూర్యాపేట పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

బాధితుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా దుబ్బతండాకు చెందిన సతీష్ భార్యతో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకట్ రెడ్డి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సతీష్‌ను మార్గం నుంచి తప్పించి శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి హత్యకు పన్నాగం పన్నారు. దీనికి సంబంధించి వారి మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణల రికార్డింగులు సతీష్ చేతికి చిక్కడంతో అసలు కుట్ర బట్టబయలైంది. ఈ విషయాన్ని దుబ్బతండా గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారు పంచాయితీ నిర్వహించి నిందితుడైన వెంకట్ రెడ్డిని నిలదీశారు. అయితే తన తప్పును తెలుసుకోవాల్సింది పోయి, రిపోర్టర్ వెంకట్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, పంచాయితీ చేసిన పది మంది గ్రామ పెద్దలపైనే అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని బాధితుడు ఆరోపించారు.

అంతేకాకుండా వెంకట్ రెడ్డి తన మైనర్ కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని, ప్రస్తుతం తనకు మరియు తన కుమార్తెకు ప్రాణహాని ఉందని బాధితుడు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయకుండా రక్షణగా నిలబడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణాపాయం పొంచి ఉందని, వెంటనే స్పందించి నిందితుడైన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకట్ రెడ్డిపై పోక్సో చట్టంతో పాటు హత్యాయత్నం కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని సతీష్ డిమాండ్ చేశారు. బాధితుడి ఆందోళనకు స్థానికులు కూడా మద్దతు తెలపడంతో సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.