BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు..

Select Suryaa Now
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం..  విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం..  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు..

 

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి:

పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకు వస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

రాత్రి 10 గంటలు దాటిన భట్టి విక్రమార్క కుస్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం గడిచిన రెండున్నర సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.

ఇందులో భాగంగా 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో కోటి ఆరు లక్షల మందికి రేషన్ కార్డు అందజేయడంతో పాటు అరకిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని భట్టి తెలిపారు.

తెలంగాణకు భవిష్యత్తు మంచి మానవ వనరులను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు వారానికి మూడు రోజులపాటు పాలు రాగి, జావా అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని భట్టి తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రూపాయలు రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి తెలిపారు.

తెల్లవారితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ మంత్రి లక్ష్మణ్ కుమార్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అనేక ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానం మేరకు ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి భూమి పూజలు పాల్గొనడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.