జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం.
ఏడేళ్లుగా భువనేశ్వర్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా మగ్గుతున్న మావోయిస్టు నేత అనారోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన.. రాజకీయ ఖైదీల విడుదలకు హక్కుల సంఘాల డిమాండ్
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ రమేష్ గత ఏడేళ్లుగా ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకర్ చాలా కాలంగా జైలులోనే ఉన్నారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని పలు నివేదికలు కూడా పేర్కొన్నాయి.
దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాసి శంకర్ 1980లలో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. దుబ్బాక ప్రాంత దళ కమాండర్‌గా, నర్సాపూర్ ప్రాంత దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా, అనంతరం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంత కమిటీ సభ్యుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో విప్లవోద్యమ విస్తరణలో ఆయన పాత్ర ఉందని ఉద్యమ వర్గాలు చెబుతున్నాయి. అనేక ఎన్‌కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్న శంకర్, నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని గడిపి మావోయిస్టు పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు.
2021లో ఒడిశా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన తర్వాత భువనేశ్వర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటూ జైలులోనే ఉన్నారు. ఆయనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి.
దుబాసి శంకర్ కుటుంబం కూడా ఉద్యమ నేపథ్యంలో తీవ్ర నష్టాలను చవిచూసింది. ఆయన సహచరి శ్రీలత అలియాస్ భారతి ఎన్‌కౌంటర్‌లో మరణించగా, కుటుంబంలోని మరికొందరు సభ్యులు కూడా వివిధ సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెదిరిపోయి జీవనం సాగిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇటీవల శంకర్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. సరైన వైద్య చికిత్స అందించి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలు, విచారణ ఖైదీల కేసులను వేగంగా పరిష్కరించాలని హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి. పీడిత తాడిత ప్రజల కోసం గత 45 ఏళ్లుగా విప్లవోద్యమంలో చురుగ్గా పనిచేసి ప్రజా సమస్యలే పరిష్కారంగా పనిచేసిన ఒక విప్లవ నాయకుడి పరిస్థితి నేడు అత్యంత దయానియంగా మారింది. ఒకవైపు అనారోగ్యం మరోవైపు వయోభారం. మరోవైపు కుటుంబ సమస్యలు చుట్టుముట్టాయి.
దుబాషి శంకర్. సహచరిణి లత అలియాస్ భారతి చనిపోవడం. సొంత అన్న కూతురైన దుబాసి గంగవ్వ 1997 జిన్నారం మండలం లక్ష్మాపూర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. మరోవైపు తన సొంత అన్న దుభాషి రాజయ్య.1996 లో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినాడు. అప్పట్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక చర్చకు దారి తీసింది. నక్సలైట్లు అంటే డబ్బులు సంపాదిస్తారు అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా దుబా సి రాజయ్య ఆత్మహత్య తో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నదనేది అర్థమైంది. గత ఏడు సంవత్సరాలుగా. ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైదీగా జైల్లోనే ఉన్నాడు. 100కు పైగానే కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కుడి కాల్ ఇన్ఫెక్షన్తో నడవలేని స్థితిలో జైల్లో ఉన్నాడు. అతని ఆరోగ్యం మెరుగుపడాలంటే మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించాలని అతని బంధువులు తెలంగాణ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మావోయిస్టు పార్టీ లేనప్పుడు జైళ్లలో నిర్బంధించుడు ఎందుకని ప్రజాస్వామికవాదులు. ప్రజలు హక్కుల సంఘాలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. దుబాయి శంకర్ కుటుంబం నేడు చినాభిన్నమైంది. చెట్ల నర్సంపల్లి లో ఎవరు ఉండడం లేదు. ఒకానొక కొడుకు. హైదరాబాదులో ఓ ప్రైవేట్ పరిశ్రమలు పనిచేస్తూ బతుకుతున్నాడు. దుబాసి శంకర్ విడుదల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కి మల్ల రాజిరెడ్డి. తీపిరి తిరుపతి. విన్నవించారు. రాజకీయ ఖైదీలతో పాటు. ఆదివాసి ఖైదీలు సుమారు 6000 మంది విడుదల చేయాలని. ఎలాంటి షరతులు లేకుండా కేసులను ఎత్తివేసి జైలు నుండి విముక్తి కల్పించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2026 ఆగస్టు 15న వెయ్యి మంది ఖైదీలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ ఖైదీని కానీ. ఆదివాసి ఖైదీలు కానీ విడుదల చేయడం లేదు. 1986 లో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమ నిర్మాతలైన డాక్టర్ అంకం బాబురావు. ఓరుగంటి సుదర్శన్. అలియాస్ మహేందర్. సముద్రుడు. శాఖమూరి అప్పారావు. మేడం బాలకృష్ణతో కలిసి విప్లవోద్యమ నిర్మాణానికి అలుపెరుగని పోరాటాన్ని నిర్వర్తించాడు. ఓరుగంటి సుదర్శన్ కు ప్రియ శిష్యుడు దుబాషి శంకర్. భువనేశ్వర్ సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైదీగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కేసులను ఎత్తివేసి విడుదల చేసినట్లయితే ఇంటి వద్ద వృద్ధాప్యంతో ఉంటాడు ఎక్కడ కూడా వెళ్లకుండా ఉంటాడు ప్రభుత్వాలు కనికరించి విడుదల చేయాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. సొంత కోడలైన దుబాసి స్వప్న. ఎన్ ఐ ఏ కేసులో విశాఖపట్నం మహిళా సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉంది. కుటుంబంలో ఇద్దరు నేను నాలుగోడాల మధ్య బంధీలుగా ఉండడం అందరినీ కలిసివేస్తుంది. మానవతా దృక్పథంతో విడుదల చేయాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు