రాష్ట్ర విద్యుత్ రంగం దేశంలోనే ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ టీజీఎస్పీడీసీఎల్ గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 333 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (PTRలు) ఛార్జ్ చేయబడ్డాయి. వీటిలో 5 ఎంవీఏ, 8 ఎంవీఏ, 12.5 ఎంవీఏ మరియు 16 ఎంవీఏ సామర్థ్యాల పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఈ సామర్థ్య పెంపు ద్వారా విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు ఓవర్‌లోడింగ్ సమస్యలు నివారించబడి, వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతోంది.
ఎస్పీడిసియల్ పరిధిలో సర్కిల్ వారీగా PTRల సామర్థ్య పెంపుతో పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో భారీ మౌలిక వసతుల విస్తరణ తో పాటు వోల్టేజ్ సమస్యలు తగ్గి రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తుంది
విద్యుత్ రంగంలో అభివృద్ధికి ప్రభుత్వ కట్టుబాటు
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, భూగర్భ విద్యుత్ లైన్లు, స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయగలిగామని అధికారులు తెలిపారు
విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించేందుకు SCADA, నెట్‌వర్క్ మ్యాపింగ్, రిమోట్ మానిటరింగ్, డిజిటల్ సేవలు, స్మార్ట్ ఆపరేషన్లను టీజీఎస్పీడీసీఎల్ విస్తృతంగా అమలు చేస్తుందని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలపడంతో పాటు, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ నాయకత్వంలో నిలిచేలా అభివృద్ధి చెందుతోందన్నారు.
ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ మరియు విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ పనిచేస్తోందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరిన్ని సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఆధునిక విద్యుత్ మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన విద్యుత్ రంగ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక పురోగతికి, వ్యవసాయ రంగ బలోపేతానికి మరియు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకంగా దోహదపడుతున్నాయి అని సీఎండీ పేర్కొన్నారు.