BREAKING
పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కట్కూరి సత్యనారాయణరెడ్డి మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు డీఆర్డీవోలో రీసెర్చ్ ఉద్యోగాలు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

Select Suryaa Now
పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

 జిల్లా వ్యాప్తంగా 1216 దరఖాస్తులు.. 

- 1030 మంది అభ్యర్థుల హాజరు

- పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు 

కొత్తగూడెం క్రైమ్, సూర్య మేజర్ న్యూస్

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఉచిత శిక్షణ కోసం 1216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1030 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. జిల్లాలోని ఐదు సబ్‌-డివిజన్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం సబ్‌-డివిజన్‌లో సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పాల్వంచ సబ్‌-డివిజన్‌లో అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్, ఇల్లందు సబ్‌-డివిజన్‌లో గవర్నమెంట్ హై స్కూల్ (జె.బి.ఎస్.), మణుగూరు సబ్‌-డివిజన్‌లో శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్, భద్రాచలం సబ్‌-డివిజన్‌లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులకు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులకు కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచే విధంగా సమగ్ర శిక్షణ, అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పాటు క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవచ్చని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణలో చురుకుగా పాల్గొని, నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో సబ్‌-డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.