BREAKING
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు సిక్కింలో కొండచరియలు విరిగిపడి తీస్తా,చ్యకూంగ్ నదుల ప్రవాహానికి అంతరాయం 'దినమలర్' 75వ వార్షికోత్సవం సాక్ష్యాధారిత గుండె సంరక్షణను బలోపేతం చేయడానికి 'ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ' ప్రారంభం తైవాన్‌ను ఏకాకిని చేసేందుకు చైనా కుట్రలు

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ…

Select Suryaa Now
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ…

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ భారీగా ఆటో ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ చౌక్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఆటో నడిపారు. ర్యాలీ ప్రారంభానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రంతో రూపొందించిన వినూత్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.“నిన్న ఒక జెండా.. నేడు ఇంకో కండువా.. అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీ.. ఎటు లాభం ఉంటే అటు జంప్” అనే అర్థం వచ్చేలా రూపొందించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంది. అలాగే ‘ఓటుకు నోటు’ అంశాన్ని ప్రస్తావిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలపై తమ గళం వినిపిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.