BREAKING
గుజరాత్‌లో పోలీసుల 'తక్షణ న్యాయం' మార్నింగ్ వాక్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ సందడి ఉదయం నిద్ర లేవగానే ఆ పొరపాటు చేస్తున్నారా? ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ చిన్న నియమాలు పాటించండి! ముంబై దహీ హండి వేడుకల్లో విషాదం నేపాల్ లో 1,331 మంది మృతి, 5,000 మంది గల్లంతు హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కాలిఫోర్నియాలో చిన్న విమానం కూలింది పెంటగాన్ లీక్‌ల కలకలం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా క్షిపణి దాడులు రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల పునరుద్ధరణ ఏథెన్స్ ఎయిర్ షోలో విషాదం ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల విరుచుకుపాటు పాకిస్తాన్ నిరంతరం ప్రధాన భద్రతా సమస్యే నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల కలకలం

మార్నింగ్ వాక్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ సందడి

Select Suryaa Now
మార్నింగ్ వాక్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ సందడి


వాకర్స్ మధ్యలో ‘పైలెట్’ సందడి.. విలియమ్ మూన్ గ్రౌండ్‌లో ఆత్మీయ పలకరింపులు
తాండూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 6): తాండూర్‌లోని విలియమ్ మూన్ గ్రౌండ్‌ ఆదివారం ఉదయం వాకర్స్‌తో సందడిగా మారింది. అదే సమయంలో గ్రౌండ్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
ఉదయపు చల్లని గాలిలో గ్రౌండ్ చుట్టూ వాకింగ్ చేస్తూ మధ్య మధ్యలో వాకర్స్‌ను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వాకర్స్‌లో ఒకరిగా కలిసిపోయి వారితో సరదాగా ముచ్చటించడం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పలువురు వాకర్స్‌ పైలెట్ రోహిత్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. “మీరు మళ్లీ గెలవాలి.. మాకు అండగా ఉండాలి” అంటూ తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొందరు వాకర్స్‌ ఆయనతో కలిసి కాసేపు నడుస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. దీంతో విలియమ్ మూన్ గ్రౌండ్‌లో ఉదయం వేళ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.