BREAKING
కార్తీ మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం! ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ కాంబినేషన్ 'ఎపిక్' రిలీజ్ డేట్ ఖరారు - థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం! టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని 18 ఏళ్ల ప్రస్థానం: అసాధారణ ప్రయాణం, అంకితభావానికి ప్రతీక విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీ *ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్.. నిజామాబాద్‌లో కలకలం నిజామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, ఆన్‌లైన్ విధానం రద్దు చేయాలని డిమాండ్ ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! సీఎం చంద్రబాబుతో జేఏసీ భేటీ.. పీఆర్సీ, డీఏలపై ఉత్కంఠ సెప్టెంబర్ వానలకు బ్రేక్? ఖరీఫ్ పంటలపై పెరుగుతున్న ఆందోళన రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా భారత్ ప్రయత్నాలు.. ఇరుదేశాలతో నిరంతర సంప్రదింపులు వినోద ప్రపంచంలో సందడి.. కొత్త సినిమాలు, స్ట్రీమింగ్ కంటెంట్‌తో ఈ వారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! హైదరాబాద్‌లో హార్స్ రేసింగ్ సందడి.. సెప్టెంబర్ 5 రేస్ కార్డు విడుదల భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపు.. కానీ గ్లోబల్ వడ్డీ రేట్లతో కొత్త సవాలు! కొడంగల్ లో ఓటుకు కాపలా KRMB కీలక ఆదేశం: శ్రీశైలం నుంచి నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణకు సూచన మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్.. నిజామాబాద్‌లో కలకలం

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్.. నిజామాబాద్‌లో కలకలం

 
సూర్య వేల్పూర్ :
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన కుటుంబం వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.ఆసుపత్రిలో ఉన్న సమయంలో గుర్తు తెలియని మహిళ బాలుడి వద్దకు వచ్చి చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి అతడిని వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆసుపత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్ ఘటనతో రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.