BREAKING
డీఆర్డీవోలో రీసెర్చ్ ఉద్యోగాలు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి

కొడంగల్ లో ఓటుకు కాపలా

Select Suryaa Now
కొడంగల్ లో ఓటుకు కాపలా

 

ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి: సీఎం రేవంత్‌రెడ్డి

కొడంగల్, సెప్టెంబరు 5 (మేజర్ న్యూస్): కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించడం వల్లే నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమైన ఆయన.. ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి ముఖ్య నాయకుడు నాలుగు గ్రామాల బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని సూచిస్తూ.. ఓటు హక్కును కాపాడుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజ నర్సింహా, ఎమ్మెల్సీ దయాకర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే లు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్. ప్రశాంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.