బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
బస్సు వెనక భాగం తగలడంతో బైక్ బోల్తా
బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ సమీపంలో మలుపు తిరుగుతున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సు వెనక భాగం పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనానికి తగలడంతో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. బైక్‌పై ఉన్న మహిళ, చిన్న బాలుడు కిందపడగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులు మలుపు తిరిగే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.