BREAKING
హల్ద్వానీ అంశంపై కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది పిల్లలను స్క్రీన్ టైమ్, డ్రగ్స్ వ్యసనాల నుంచి కాపాడాలి రైతుబీమా నిలిపివేత పసిడి ప్రియులకు తీపికబురు.. సెప్టెంబర్ 5న భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడల్లో తాజా రేట్లు ఇవే కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి… ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో పెరిగిన ఉత్కంఠ ఉపాధ్యాయుల దినోత్సవం: అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే మార్గదర్శకులు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలు నేటికీ స్ఫూర్తిదాయకం స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్ బస్సు అంతర్జాతీయ వేదికపై మోదీ వ్యూహాత్మక చదరంగం.. తెరవెనుక దౌత్యంతో భారత్ సరికొత్త రికార్డు రవితేజ 'ఇరుముడి' బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు తరతరాలను తీర్చిదిద్దుతున్న గురువులకు నమస్సులు: ఐసీసీ ఛైర్మన్ జై షా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, వినూత్న బోధన చేపట్టాలి మెడికల్ అడ్మిషన్లలో జీవో 102తో రిజర్వ్‌డ్ వర్గాల విద్యార్థులకు అన్యాయం.. సీఎం చంద్రబాబుకు రఘువీరారెడ్డి బహిరంగ లేఖ ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై సర్కార్ మౌనం.. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలంటూ రేవంత్ సర్కార్‌కు తెలంగాణ రక్షణ సేన అల్టిమేటం

కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి…

Select Suryaa Now
కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి…

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి 
కరీంనగర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడేందుకు వస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ముందుగా తమ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అంశాలపై సమాధానం చెప్పాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
2023 డిసెంబర్ 3 నాటికి సుమారు రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయో చెప్పాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, గ్రూప్ పరీక్షల లీకేజీలతో నిరుద్యోగులు నష్టపోయారని ఆరోపించారు.
2014, 2018 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తమ హయాంలో యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వైస్‌చాన్స్‌లర్లను నియమించకుండా ఇన్‌చార్జ్‌లతో ఎందుకు కొనసాగించారో కేటీఆర్‌ ముందుగా ప్రజలకు వివరించాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.