అచ్చంపేటలో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ కుమారాచారికి ఘన వీడ్కోలు
అచ్చంపేట: వైద్య ఆరోగ్య శాఖలో 34 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ చేపూరి కుమారాచారి ఉద్యోగ విరమణ సందర్భంగా అచ్చంపేటలో శనివారం ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. (తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్టుల సంఘం) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.
ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచర ఉద్యోగులు మాట్లాడుతూ.. కుమారాచారి 34 ఏళ్ల సర్వీసులో అంకితభావం, నిబద్ధత, నిజాయితీతో సేవలు అందించారని కొనియాడారు. ఫార్మసీ విభాగంలో ఆయనకున్న అపారమైన అనుభవంతో తోటి సిబ్బందికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచారని, ఆయన క్రమశిక్షణ, సేవాభావం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఫార్మసీ అధికారులు, వైద్య సిబ్బందితో పాటు M. సురేష్, శ్రీనివాసులు, దామగట్ల కుమార్, GK వెంకటేష్, సంతోష్, భగత్ సింగ్, సాయిరామ్, రవి, జేయవర్థన్, మాధవి, అఖిల తదితరులు పాల్గొని కుమారాచారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.