రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తన పర్యటనలో రెండవ రోజైన శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీ సందర్భంగా ఒడిశా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారిద్దరూ చర్చించారు. రాష్ట్ర పురోగతి, పాలన మరియు ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై గవర్నర్, రాష్ట్రపతి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.