BREAKING
ఏపీలో కొత్త పింఛన్లపై గుడ్ నూస్.. అక్టోబర్ నుంచి దశలవారీగా పంపిణీ! హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల నిరసన గళం.. ఆందోళనలకు జేఏసీ పిలుపు! తిరుమలలో వైభవంగా ఉట్లోత్సవం.. పోటెత్తిన భక్తులు, టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు! కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తిరుమలలో నేటి శ్రీవారి దర్శన సమయాలు మరియు లైవ్ అప్‌డేట్స్.. క్యూలైన్ల వివరాలు ఇవే! కృష్ణా జలాలపై కేఆర్‌ఎంబీ సంచలన ఆదేశాలు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని స్పష్టీకరణ! రేషన్ కార్డుదారులకు అలర్ట్.. నేటితో ముగియనున్న ఉచిత బియ్యం పంపిణీ గడువు! తక్షణమే మీ కోటా పొందండి. గురువుకు వందనం.. నేడు దేశవ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం! అసలు ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. నేటి పసిడి, వెండి మార్కెట్ విశేషాలు! తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు షాక్.. ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధరలు! డెహ్రాడూన్ పోలీస్ లైన్స్‌లో జన్మాష్టమి వేడుకలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు నేటి నుండి గోవాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండవ దశ టెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం శ్రీకృష్ణుని దివ్య ఆగమనం అపారమైన ఆనందానికి ప్రతీక

కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Select Suryaa Now
కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. నేడు వరుస ప్రారంభోత్సవాలు
కొడంగల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 5): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కొడంగల్‌లో బస చేసిన సీఎం.. శనివారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో నేటి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సీఎం హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించనున్నారు.
తదుపరి MPPS & ZPHS బాలికల పాఠశాల భవనాన్ని, అనంతరం R&B గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 1 గంటలకు కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.