BREAKING
నాణ్యత లో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి పట్వారిగూడెంలో అమానుషం: ఆర్ఎంపీ క్లినిక్ వద్ద పసికందును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు. ఇస్రో మరో ఘనవిజయం: GSLV-F17 రాకెట్ ద్వారా నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన 'EOS-05' శాటిలైట్! శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం! హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ప్రతి పేదవాడికీ వైద్యం అందాలి లంకపోతు అంజిరెడ్డి నీ స్థాయేంటి...? నేపాల్ వరద బాధితులకు భారత్ చేయూత: మరో 21 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని పంపిన విమానాలు! ఆదిలాబాద్ వాగులో కోట్ల విలువైన రత్నాల నిధి.. 6.5 కోట్ల ఏళ్ల నాటి అద్భుతం! కార్ ప్రియులకు షాక్: సెప్టెంబర్ 1 నుంచి ప్రియమైన టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు - రూ. 25,000 వరకు పెంపు! ఘనంగా సూర్య దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు మౌలి తనుజ్ ప్రశాంత్ 'దొంగ నా కొడుకు' - శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న క్రైమ్ కామెడీ మూవీ! ఇంటర్ విద్య జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. కొరివితో తలగోక్కున్నట్టేనని హెచ్చరిక! సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' రెండో షెడ్యూల్ పూర్తి - 'ది డెడ్లీ డాక్టర్' ట్యాగ్‌లైన్‌తో అంచనాలు తారాస్థాయికి! నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి

నాణ్యత లో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి

Select Suryaa Now
నాణ్యత లో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి


దౌల్తాబాద్‌లో అభివృద్ధి పనుల పరిశీలన.. హకీంపేటలో కొడంగల్ అభివృద్ధిపై సీఎం సమీక్ష
దౌల్తాబాద్/దుద్యాల  మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 04): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం దౌల్తాబాద్ మండలంలో పర్యటించారు. గోకఫస్లాబాద్‌లో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, దౌల్తాబాద్‌లో రూ.4.80 కోట్లతో చేపడుతున్న జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా, పటిష్టంగా పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హనుమాన్ దేవాలయం వద్ద ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.అనంతరం హకీంపేటలో 200 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించి, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, రేడియల్ రోడ్డు, పారిశ్రామిక ప్రాజెక్టు, రోడ్లు, హౌసింగ్, తాగునీరు, విద్య, వైద్యం తదితర పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 81 కి.మీ. రేడియల్ రోడ్డు భూసేకరణను అక్టోబర్‌లోగా పూర్తి చేసి నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి తండాకు రహదారి ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో  తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి, నారాయణపేట కలెక్టర్ ప్రియాంక, ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.