లంకపోతు అంజిరెడ్డి నీ స్థాయేంటి...?
లంకపోతు అంజిరెడ్డి నీ స్థాయేంటి...?
సూర్య, ఒంగోలు రిపోర్టర్ : నీ స్థాయిని మరిచి మాగుంటను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలుగు దేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు వైసిపి నేతలను హెచ్చరించారు. గతంలో పశ్చిమ ప్రాంతానికి జరిగిన అన్యాయం, అక్కడ ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను చూసే వెలిగొండ జలాల విడుదల సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ విధంగా స్పందించారే తప్పా స్వార్థపూరిత విమర్శలు లేవు అనే అంశాలను గుర్తెరగాలని హితవులు పలికారు. శుక్రవారం ఒంగోలు కర్నూల్ రోడ్లోని ఏ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్, తాత ప్రసాద్, ఎఫ్. సి.ఐ మాజీ మెంబర్ అయినా బత్తిన రాము, డిఆర్షియుసి సభ్యులు నాదేండ్ల సుధాకర్ మీడియాతో మాట్లాడారు. ఎంపి మాగుంటను విమర్శించేముందు మాట్లాడి నాయకుల ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితువు పలికారు. కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి స్థాయికి మించి మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఈదర హరిబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డిల వద్ద లబ్ధి పొంది, చివరికి వారిపైనే విమర్శలు చేస్తున్న అంజిరెడ్డి ఒక స్వార్థపరుడని అన్నారు. ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వల్ల కూడా లబ్ధి పొందిన ఆయన, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. బాలినేని తోడ్పాటుతో, అక్వా వారి వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రజల్లో ప్రాధాన్యత కోల్పోయింది, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమని. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. దేవిరెడ్డి మాట్లాడేటప్పుడు భాషా సంస్కారాన్ని పాటించాలన్నారు. 'ఓరేయ్' అనే ఏకవచన పదజాలాన్ని ఉ పయోగించడం అభ్యంతరకరమన్నారు. ఎంపీ వ్యాపారాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. ఆ ప్రజాదరణతోనే ఆయనను ప్రజలు వరుసగా గెలిపిస్తున్నారని గుర్తు చేశారు.