హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.
-
మాసాయిపేట ; హామీల అమలు లో ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, వెయ్యి రోజులు దాటినా హామీలలో మాత్రం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాసాయిపేట మండల కేంద్రంలో ముఖ్యంగా పెన్షన్లపై సమరభేరి మోగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పంట పొలాలకు నిరందిస్తే, కాలేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తూ రైతులకు నీరు అందించడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 ఉన్న పెన్షన్ ను రూ.2000 వేలకు పెంచారని కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా తదితర మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆడ పిల్ల పుడితే రూ. 13 వేలు, మెగా పిల్లాడు పుడితే రూ. 12 వేలు ఇచ్చారని, హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2500లు, పెన్షన్ లను రూ. 4 వేలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మాసాయిపేట మాజీ సర్పంచులు నాగరాజు, మధుసూదన్ రెడ్డి, తూప్రాన్ మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, శివ్వంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రా గౌడ్, నాయకులు రమణారెడ్డి, గొర్రె వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.