telanagana
ఘనంగా సూర్య దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు
సూర్య కరీంనగర్ ప్రతినిధి :ప్రజలకు నిష్పక్షపాతమైన, వాస్తవాధారిత వార్తలను అందించడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తున్న సూర్య దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలను కరీంనగర్ యూనిట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్ బోనాల వెంకటేష్ కేక్ కట్ చేసి చైర్మన్ సూర్య ప్రకాష్ రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బోనాల వెంకటేష్ మాట్లాడుతూ.. పత్రికా రంగంలో విలువలు, నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ సూర్య దినపత్రికను ప్రజల మన్ననలు పొందేలా ముందుకు తీసుకెళ్తున్న చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు సేవలు అభినందనీయమన్నారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డెస్క్ జర్నలిస్టులు జనార్ధన్, మహేష్, నాగరాజు, వేణు పాల్గొని చైర్మన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.