161వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి...
01 సూర్య కామారెడ్డి జిల్లాప్రతినిధి: 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జుక్కల్ మండలం కౌలాస్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ డి. ఆంజనేయులు సీటు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బస్సును పైకి లేపి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంలో బస్సు ముందు రెండు టైర్లు విడిపోయాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.