BREAKING
గంగా తెప్పోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయాలి : ఖన్నా గంగపుత్ర హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనూహ్య పరిణామం.. 'స్పైడర్ మ్యాన్'ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లిన 'ది ఒడిస్సీ తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు తుది గడువు సమీపంలో ఉంది: సెప్టెంబర్ 9 చివరి తేదీ! ఆదిత్య, కడలిల అందమైన ప్రేమ ప్రయాణం.. ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ రిలీజ్! బిగ్ అప్‌డేట్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ #L367 అనౌన్స్‌మెంట్ టైమ్ ఫిక్స్! వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం': అక్టోబర్‌లో థియేటర్లలోకి విక్టరీ మూవీ.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ! కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. మెగా ఇంట్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. రాధాకృష్ణుల వేషధారణల్లో మురిసిపోయిన మెగా వారసులు ఆ గాయం మాకు దొరికిన వరం".. విజయ్‌తో గడిపిన అరుదైన క్షణాలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్! నందమూరి బాలకృష్ణ 'NBK111' అప్‌డేట్: పవర్‌ఫుల్ గ్లింప్స్‌తో మాస్ రచ్చ.. ఆ తేదీన బిగ్ అనౌన్స్‌మెంట్! అల్లరి నరేష్ మార్క్ వింటేజ్ కామెడీ రాంపేజ్.. ‘రంభ ఊర్వశి మేనక’ రివ్యూ! అభివృద్ధి, సంక్షేమంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ మెగాస్టార్ 'కాకా' తాజా అప్‌డేట్.. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్! ???? సంగీత్ శోభన్ - అనస్వర రాజన్ క్రేజీ లవ్ స్టోరీ.. సెప్టెంబర్ 6న టైటిల్ గ్లింప్స్ విడుదల! సినిమా థియేటర్‌కు వచ్చిన నయనతార.. ప్రమోషన్ స్ట్రాటజీనా? లేక నిజమైన ఆత్రుతా?

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.

Select Suryaa Now
కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.
రాధాకృష్ణుల వేషధారణలో అలరించిన చిన్నారులు.
విద్యార్థుల సందడితో కళకళలాడిన కృష్ణవేణి పాఠశాల.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా కృష్ణాష్టమి వేడుకలు.
శ్రీకృష్ణుడి బోధనలు విద్యార్థులకు ఆదర్శం: ప్రిన్సిపాల్ సిహెచ్. రాజేష్.

పటాన్ చెరు ...కృష్ణవేణి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై అలరించారు. చిన్నారుల కృష్ణ, రాధ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణం చిన్నారుల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. రాజేష్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి పండుగలను పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాపాడుతూ, సత్యం, న్యాయం, కర్తవ్యబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో చేసిన ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు శ్రీకృష్ణుడి జన్మవృత్తాంతం, ఆయన బోధించిన భగవద్గీత సందేశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.