గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం
బొల్లారం డివిజన్ సిఐ సుధీర్ కుమార్
జిన్నారం : బొల్లారం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో సీఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఫీస్ కమిటీ సమావేశంలో సిఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మండపాల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు సహకరించాలన్నారు. పోలీస్, విద్యుత్, డివిజన్ శాఖల అధికారులు సిబ్బంది సహాయంతో ఉత్సవాలను జయప్రదంగా జరుపుకునేలా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. నిమజ్జన కార్యక్రమానికి డివిజన్ యంత్రాంగం అన్ని విధాల సహకరిస్తుందని సిఐ సుధీర్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఏ ఎస్ ఐ పుండరీకం , ఎస్ ఐ అక్షిత రెడ్డి , పోలీస్ సిబ్బంది, కాజిపల్లి మాజీ సర్పంచ్ నవీన్, సత్యనారాయణ, కమిటీ సభ్యులు , స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.