telanagana
కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
Telanagana
04 Sep 2026
29 views
By సూర్య ప్రతినిధి
Updated : 04 Sep 2026 15:18 IST
Select Suryaa Now
తెలంగాణ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు మరింత పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం కలుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.