పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
వికారాబాద్, మేజర్ న్యూస్: పల్లవి మోడల్ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు ఎంతో అద్భుతంగా సాగాయి. వారి ప్రతిభను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు నవాజ్ రెడ్డి, అశోక్, వివేకానంద రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ మాధవి గారు నిర్వహించారు.