BREAKING
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే మా ప్రధాన లక్ష్యం: సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి. కమల్ హాసన్ - ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ కాంబో.. ఇంటెన్స్ లుక్‌తో వైరల్ అవుతున్న 'ఆర్‌కేఎఫ్‌ఐ' కొత్త ప్రాజెక్ట్! పామాయిల్ ఫ్యాక్టరీలో నవశకం: 9 నెలల్లోనే సరికొత్త రికార్డుల ప్రస్థానం పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం చెత్త ఏరుకునే కార్మికులకు 'నమస్తే', 'ఆయుష్మాన్' కార్డుల పంపిణీ హిమాలయాల్లో మితిమీరిన అభివృద్ధే నేపాల్ విపత్తుకు కారణం చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రియురాలికి ఐఫోన్‌ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్ రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి యుఎస్ ఉద్యోగాల డేటాకు ముందు కోలుకున్న ఆసియా మార్కెట్లు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, హెచ్చరికలు జారీ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు, ఉరుములు జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం

డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి.

Select Suryaa Now
డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి.

డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి.

* ఆర్ & బి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.

దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::

మండల పరిధిలోని ములకపాడు సెంటర్ లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు గురువారం ఆదేశించారు.ఇటీవల కొంతకాలంగా ములకపాడు జంక్షన్ లో గల పశు వైద్యశాల ముందు భాగంలో   కొందరు వ్యక్తులు  ఆక్రమణలకు పాల్పడడంతో  ఆ ప్రాంతంలో నిర్మించిన డ్రైనేజీ పూర్తిగా ధ్వంసమై  నీరు నిలిచిపోతుండగా, మరోపక్క  పశువుల వైద్యశాలకు దారే లేకుండా స్థలాలను ఆక్రమించి వ్యాపార షాపులు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో ములకపాడు   పశు వైద్య అధికారి  ఆక్రమణ విషయంపై,  డ్రైనేజీ సమస్యపై ములకపాడు సర్పంచ్  పరిస్క తులసమ్మ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో స్థానికసర్పంచ్ భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు తో  ఆక్రమణదారుకు గురైన ప్రాంతాలను సందర్శించి  స్వయంగా సమస్యను పరిశీలించారు.సమస్య ప్రాంతం నుండి  చరవాణిలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే  బౌండరీలు వేసి మొత్తం డ్రైనేజ్ కి ట్రెంచ్ తీసి నీటిని మళ్లించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ. జగన్, ఆర్ ఐ కల్లూరి వెంకటేశ్వర్లు, ములకపాడు పశు వైద్యాధికారి,గ్రామ పంచాయతీ కార్యదర్శి  నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లంక శ్రీనివాసరావు (అబ్బులు ), సిరపు అప్పల రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, మాజీ ఎంపీపీ మర్మం చంద్రయ్య, ఆక్రమణదారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.