BREAKING
నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన పండుగ కాంతులతో వెలిగిపోతున్న మధుర, బృందావన్ ఆగర్-అలియాసిమ్‌పై ఖచనోవ్ సంచలన విజయం ప్రాంతీయ స్థిరత్వం, శాంతికి భారత్-వియత్నాం కట్టుబాటు స్మృతి మంధన రికార్డు శతకం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సంచలన నిర్ణయం: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు! సారీ అండీ.. రాంగ్ నెంబర్'.. హనీట్రాప్ వలలో చిక్కుకుని రూ. 4 లక్షలు పోగొట్టుకున్న యువకుడు! సముద్ర భద్రత, సాంకేతికతలపై సమీక్షించిన క్వాడ్ షెర్పాలు మరో 21.5 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్ 'వెడ్ ఇన్ ఇండియా' ఉద్యమం: దేశీయంగానే పెళ్లిళ్లు చేసుకోండి – ప్రధాని మోదీ కీలక పిలుపు! BRICS సదస్సు వేళ సెప్టెంబర్ 11న కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు నార్వే స్వాధీనంలో రష్యన్ క్రూయిజ్ నౌక: మాస్కో తీవ్ర ఆగ్రహం ఇస్రో అద్భుత ప్రయోగం: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F17 మరియు EOS-05 విశేషాలు! కృష్ణాష్టమి వేడుకలతో మార్మోగుతున్న దేశం: కన్నయ్య జన్మదిన వేడుకల విశేషాలు! తిరుమలలో శ్రీవారి దర్శన సమయాలు: నేటి క్యూలైన్లు, రద్దీ మరియు లైవ్ అప్‌డేట్స్!

నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన

Select Suryaa Now
నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన

నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 
పలు అభివృద్ధి పనులను పరిశీలన చేయనున్న సీఎం 
దౌల్తాబాద్/దుద్యాల్, మేజర్ న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి (సీఎం ) రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల్లో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3.10 గంటలకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోక పస్లాబాద్ కు చేరుకుని బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. 3.50 నుంచి 4 గంటల వరకు దౌల్తాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.సాయంత్రం 4.30 గంటలకు దుద్యాల్ మండల పరిధిలోని హకీంపేట్‌కు చేరుకుని ఎడ్యుకేషన్‌ హబ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.అనంతరం 5.40 నుంచి రాత్రి 9 గంటల వరకు హకీంపేట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి 9.05 గంటలకు హకీంపేట్‌ నుంచి కొడంగల్‌కు బయలుదేరి 9.20 గంటలకు కొడంగల్‌లోని నివాసానికి చేరుకుని రాత్రి బస చేయనున్నారు.
*పటిష్ట భద్రతా ఏర్పాట్లు*
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం సూచించింది. సీఎం రేవంత్‌రెడ్డికి ‘Z+’ కేటగిరీ భద్రత ఉన్నందున భద్రత, బందోబస్తు, ఎస్కార్ట్‌, రవాణా, ప్రోటోకాల్‌ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.