రేవంత్ రెడ్డి ఓన్లీ వన్ టైం మాత్రమే గెలిచారు
మా అమ్మ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కొండా సుస్మిత
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ, ఆయన ఉద్దేశపూర్వకంగానే బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
"రేవంత్ రెడ్డి కేవలం వన్ టైమ్ జెడ్పీటీసీ, వన్ టైమ్ ఎమ్మెల్సీ, వన్‌టైమ్ ఎమ్మెల్యే మరియు వన్ టైమ్ ఎంపీ మాత్రమే. కానీ మా అమ్మ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. అలాంటి ప్రజాదరణ పొందిన నాయకురాలిని రేవంత్ రెడ్డి తీవ్రంగా అవమానించారు." "నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కేవలం ఒక వ్యక్తి (రేవంత్ రెడ్డి) వైఖరికి వ్యతిరేకంగా మాత్రమే నా గళం విప్పాను."
"గతంలో బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు, కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు?" అని సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.