BREAKING
అహ్మదాబాద్ ఎన్‌సిబిని సందర్శించిన 21 దేశాల ప్రతినిధులు సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్ శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! ????????సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్ శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి "మా అమ్మను ఎలా బలి చేస్తారు?" స్త్రీవాద ఉద్యమ శిఖరం గ్లోరియా స్టెయిన్మ్ (92) కన్నుమూత ఆటో రంగానికి పీయూష్ గోయల్ పిలుపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వస్త్ర వ్యర్థాల నుండి విలువైన ఉత్పత్తులు భారత్‌ను ‘ప్రపంచ శక్తి’గా అభివర్ణించిన ఉక్రెయిన్ ‘యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవు’ సోనూసూద్: రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరో వరకు 'బయో-నివేష్' వేదికను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆది'కేనా అమాత్య పదవి!? - కొండా’పై వేటు.. ‘ఆది’కి రూట్ క్లియర్..?! - అధిష్టానం నిర్ణయంతో దేవాదాయ పీఠం దక్కేనా? -  బీసీ అస్త్రం, మున్నూరు కాపు సమీకరణం -  రేసులో దూసుకెళ్తున్న ఆది శ్రీనివాస్ భారత్ ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయ శక్తి కేంద్రం సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తితో రక్షణ రంగంలో భారత్-బెల్జియం భాగస్వామ్యం బలోపేతం

అహ్మదాబాద్ ఎన్‌సిబిని సందర్శించిన 21 దేశాల ప్రతినిధులు

Select Suryaa Now
అహ్మదాబాద్ ఎన్‌సిబిని సందర్శించిన 21 దేశాల ప్రతినిధులు

మాదకద్రవ్యాల నిరోధంపై అంతర్జాతీయ లెక్చర్
ఢిల్లీ: రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (RRU) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఐటెక్' (ITEC) కార్యక్రమంలో భాగంగా 21 విదేశాలకు చెందిన 50 మంది ఉన్నతాధికారులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. దర్యాప్తు, ప్రాసిక్యూషన్ ప్రక్రియలలో మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

ఈ సందర్భంగా భారత దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్‌సిబి అనుసరిస్తున్న విధివిధానాలు, ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ప్రస్తుతం కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్ పోకడలపై విదేశీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు.

చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, సరిహద్దుల దాటి జరిగే డ్రగ్స్ రవాణాను కట్టడి చేయడంలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులను ఈ భేటీలో పంచుకున్నారు. ఈ చర్చల ద్వారా వివిధ దేశాల మధ్య పరస్పర అవగాహన, జ్ఞాన మార్పిడి పెరిగి, అంతర్జాతీయ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాడేందుకు సహకారం మరింత బలోపేతమవుతుందని అధికారులు తెలిపారు.