BREAKING
పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..? సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి నేపాల్‌లో ఘోర విపత్తు: ఆకస్మిక వరదలు, కొండచర్యల కారణంగా వెయ్యి దాటిన మరణాలు "పల్లె నిద్ర"లో కలెక్టర్ పి. రాజాబాబు శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి ప్రభాస్‌ను కలిసిన సుమంత్ ప్రభాస్.. ‘రోమాంచకం’ టీమ్‌కు రెబల్ స్టార్ స్పెషల్ విషెస్! డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాజ్ తరుణ్ కొత్త సినిమా పోస్టర్ విడుదల ప్రమోషన్ పై వెళ్లిన పశువైద్యాధికారికి ఘన సన్మానం విద్యుత్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచి నిరంతర విద్యుత్‌ అందించండి తెలంగాణ మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా నెరెల్ల శారద నియామకం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నినదిస్తే అరెస్టులా? కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహిళా ప్రధానాంశంతో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు: సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

 సర్వీస్‌ రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పిన ద్విచక్రవాహనం

కీసర, మేజర్‌ న్యూస్‌, సెప్టెంబరు 3:
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయకనగర్‌కు చెందిన ఎం. అరుణ (24) కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

గురువారం మేడ్చల్‌లో పని ముగించుకుని భర్త మురళితో కలిసి ద్విచక్రవాహనంపై నేరేడ్‌మెట్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వారితో పాటు పొరుగున ఉండే మరో వ్యక్తి కూడా అదే వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అరుణ వాహనం వెనుక కూర్చుంది.

షామీర్‌పేట డీఆర్‌డీఏ సమీపంలోని సర్వీస్‌ రోడ్డుపై అకస్మాత్తుగా స్పీడ్‌ బ్రేకర్‌ రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దీంతో అరుణ వెనుకకు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.