పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..?
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ నేతల సూటి ప్రశ్న
కుల్కచర్ల: బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పీఏసీఎస్ చైర్మన్ బొలుసాని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బీఆర్‌ఎస్ నేతలు వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధిని కళ్లుండి చూడలేకే బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పరిగి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.