BREAKING
‘యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవు’ సోనూసూద్: రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరో వరకు 'బయో-నివేష్' వేదికను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆది'కేనా అమాత్య పదవి!? - కొండా’పై వేటు.. ‘ఆది’కి రూట్ క్లియర్..?! - అధిష్టానం నిర్ణయంతో దేవాదాయ పీఠం దక్కేనా? -  బీసీ అస్త్రం, మున్నూరు కాపు సమీకరణం -  రేసులో దూసుకెళ్తున్న ఆది శ్రీనివాస్ భారత్ ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయ శక్తి కేంద్రం సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తితో రక్షణ రంగంలో భారత్-బెల్జియం భాగస్వామ్యం బలోపేతం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్పీకర్ ఓం బిర్లా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు 'జల్ సంచయ్ జన్ భాగీదారి'కి విశేష స్పందన నేపాల్-టిబెట్ సరిహద్దులో ప్రాణాంతక ఆకస్మిక వరదలు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..? సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

Select Suryaa Now
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-​పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం
-​సిరిసిల్లలో 710 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
-​నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ వారి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మొదటి విడతలో నిర్ణీత గడువులో ఇళ్ల నిర్మాణం చేపట్టని వారి స్థానంలో నూతనంగా ఎంపిక చేసిన 710 మంది లబ్ధిదారులకు మంజూరు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పురపాలక పరిధిలోని సాయి మణికంఠ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై పత్రాలను అందజేశారు. సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘాలతో పాటు వివిధ మండలాల లబ్ధిదారుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి పంపిణీ చేపట్టగా, కలెక్టర్ ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
​సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఆదర్శం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నిర్మాణ పనులతో గ్రామాల్లో, పట్టణాల్లో కూలీలకు నిరంతర ఉపాధి, వివిధ కులవృత్తుల వారికి పని దొరుకుతూ వ్యాపార లావాదేవీలు ఊపందుకున్నాయని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత కరెంట్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. నూతన నిత్యావసర కార్డులు, ఆసరా పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మంజూరు పత్రాలు అందుకున్న వారు ఇంటి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
​నమూనా ఇళ్లను పరిశీలించి నిర్మాణాలు చేపట్టాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
సొంత ఇంటి నిర్మాణం ప్రతి కుటుంబానికి జీవితకాల కల అని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణంలో నిబంధనల ప్రకారం వెంటనే ముగ్గు పోసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలో నిర్మించిన నమూనా ఇళ్లను లబ్ధిదారులు తప్పనిసరిగా సందర్శించి, ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఇంటిని నాణ్యంగా నిర్మించుకోవాలని కోరారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, నిర్మాణ పురోగతిని బట్టి నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పనుల ఛాయాచిత్రాలను నమోదు చేస్తారని స్పష్టం చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
​హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘాల అధ్యక్షులు జిందం కళ, పుల్కం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు తిరుపతి, ఎల్లయ్య, రాజు, స్వరూప, సబేరా బేగం, రాణి, రాములు నాయక్, విజయ, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు వెంకట మాధవ రావు, రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీధర్ బాబు, తహసీల్దార్ మహేష్, వార్డు సభ్యులు, పంచాయతీ సర్పంచులు, ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.