BREAKING
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం చెత్త ఏరుకునే కార్మికులకు 'నమస్తే', 'ఆయుష్మాన్' కార్డుల పంపిణీ హిమాలయాల్లో మితిమీరిన అభివృద్ధే నేపాల్ విపత్తుకు కారణం చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రియురాలికి ఐఫోన్‌ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్ రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి యుఎస్ ఉద్యోగాల డేటాకు ముందు కోలుకున్న ఆసియా మార్కెట్లు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, హెచ్చరికలు జారీ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు, ఉరుములు జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం ఐటీ షేర్ల జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ హ్యాపీ జర్నీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి కొత్త తరహా సినిమా నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన పండుగ కాంతులతో వెలిగిపోతున్న మధుర, బృందావన్

చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల పొడవు,16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా  నిర్మాణం
-
గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుంది

బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు

కానీ ప్రజా ప్రభుత్వం నిధులు ఇచ్చి బ్రిడ్జిని పూర్తి చేసింది

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని నేను గతంలోనే చెప్పాను.

ఇక్కడ ప్రతీ గల్లీ నాకు తెలుసు..

అసదుద్దీన్ అడిగిన ప్రతీ అభివృద్ధి పనులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా..

 

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. రూ. 620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , మహమ్మద్ అజారుద్దీన్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి , అసదుద్దీన్ ఓవైసీ , కె. రఘువీర్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ ప్రారంభోత్సవ సభ జరిగింది . ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందని , బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదని కానీ ప్రజా ప్రభుత్వం నిధులు ఇచ్చి బ్రిడ్జిని పూర్తి చేసిందని తెలిపారు . 
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని తాను గతంలోనే చెప్పానన్నారు . ఇక్కడ ప్రతీ గల్లీ తనకు  తెలుసు నని , అసదుద్దీన్ అడిగిన ప్రతీ అభివృద్ధి పనులను మంజూరు చేయాలని ఈ వేదికగా అధికారులను ఆదేశిస్తున్నానన్నారు . కళాశాల అభివృద్ధి కోసం 
ఎమ్మెల్యే బలాల 20 కోట్లు అడిగారని , రూ . 25 కోట్లు మంజూరు చేస్తున్నా నన్నారు . 
తాను నిధులు మంజూరు చేస్తా.. కానీ ఏడాదిన్నరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే నన్నారు . 
విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ హిందుస్థాన్ కు మద్దతుగా నిలిచి దేశభక్తి చాటుకున్నారన్నారు . రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు.. దేశ భక్తి విషయంలో అందరం ఒక్కటే నన్నారు . మీరు కేబుల్ బ్రిడ్జి చూడాలంటే దుర్గం చెరువుకు వెళ్లాల్సి వస్తుందని అందుకే మేం మీరాలం చెరువులో 3 కి.మీ మేర కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామన్నారు . వచ్చే ఎన్నికల్లోగా గౌలి గోడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేస్తాం మని హామీ ఇచ్చారు . వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం అని పేర్కొన్నారు . హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని , హిందూ, ముస్లిం కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు . 
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని , మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు . మూసీని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామన్నారు . ఇక్కడి పేద ముస్లింలకు ఉపాధి కల్పించేలా చూస్తామని , నాగోల్ నుంచి ఎల్బీ నగర్ చంద్ర యణ గుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించబోతున్నామన్నారు . నగరాన్ని అన్ని రకాలుగా మేం అభివృద్ధి చేయాలనుకుంటుంటే.. బీజేపీ, బీఆర్ ఎస్ అడుగడుగునా అడ్డుకుంటున్నాయన్నారు . ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత అందిస్తున్నామని , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని , ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఎన్నికలు ముగిసాక అభివృద్ధి ఒక్కటే లక్ష్యం అని సీఎం అన్నారు . మనందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందా మన్నారు