BREAKING
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం చెత్త ఏరుకునే కార్మికులకు 'నమస్తే', 'ఆయుష్మాన్' కార్డుల పంపిణీ హిమాలయాల్లో మితిమీరిన అభివృద్ధే నేపాల్ విపత్తుకు కారణం చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రియురాలికి ఐఫోన్‌ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్ రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి యుఎస్ ఉద్యోగాల డేటాకు ముందు కోలుకున్న ఆసియా మార్కెట్లు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, హెచ్చరికలు జారీ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు, ఉరుములు జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం ఐటీ షేర్ల జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ హ్యాపీ జర్నీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి కొత్త తరహా సినిమా నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన పండుగ కాంతులతో వెలిగిపోతున్న మధుర, బృందావన్

రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి

Select Suryaa Now
రేవంత్ రెడ్డికి ధైర్యముంటే మా అమ్మపై పోటీ చేసి గెలవాలి

కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తన తల్లి కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్రంగా మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నేరుగా రాజకీయ సవాల్ విసిరారు.

"రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నా తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఆమెకు పోటీగా నిలబడి గెలవాలి" అని కొండా సుష్మిత సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత హోదాలో మాట్లాడినవని, వాటికి తన తల్లిని బాధ్యురాలిని చేస్తూ పదవి నుంచి తొలగించడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి, కొన్ని పరిణామాల గురించే మాట్లాడాను. అది కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానే కాదు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీకి ఆపాదించడం తప్పు" అని స్పష్టం చేశారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తల్లికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆమెను ఈ స్థితిలో చూసి మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని తాను మనస్ఫూర్తిగా శపిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి రాజకీయంగా ఎల్లవేళలా అండగా ఉంటానని, ఆమె గొంతును ఎవరూ నొక్కలేరని కొండా సుష్మిత స్పష్టం చేశారు.