కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు
సూర్య కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలను ఘనంగా నిర్వహించి, ఇందిరా చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వస్తోందన్నారు. ప్రజల గడప వద్దకు పాలన చేరిందని, కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.