హామీలు అమలు చేయని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వంటా వార్పు
సూర్య కరీంనగర్ ప్రతినిధి
మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై నిరసన తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.