BREAKING
కార్ ప్రియులకు షాక్: సెప్టెంబర్ 1 నుంచి ప్రియమైన టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు - రూ. 25,000 వరకు పెంపు! ఘనంగా సూర్య దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు మౌలి తనుజ్ ప్రశాంత్ 'దొంగ నా కొడుకు' - శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న క్రైమ్ కామెడీ మూవీ! ఇంటర్ విద్య జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. కొరివితో తలగోక్కున్నట్టేనని హెచ్చరిక! సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' రెండో షెడ్యూల్ పూర్తి - 'ది డెడ్లీ డాక్టర్' ట్యాగ్‌లైన్‌తో అంచనాలు తారాస్థాయికి! నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి స్వయంపాకం అంటే ఆకలి తీర్చడం కాదు.. పవిత్ర యజ్ఞం! విశ్వనాథ సత్యనారాయణ తత్వమిదే! తెరపై ఆయన విగ్రహం కనిపిస్తే చాలు.. ఎస్వీఆర్ నటనా వైదుష్యంపై ఎల్.వి. ప్రసాద్ చెప్పిన అద్భుత పాఠం! బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి నాగ చైతన్య చేతుల మీదుగా 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్ లాంచ్: సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' గ్రాండ్ రిలీజ్! థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్‌లు - ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్! 'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్! విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్ ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన! దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్!

నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి

Select Suryaa Now
నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి

 


సీఎం రేవంత్ రెడ్డి
బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
దౌల్తాబాద్, మేజర్ న్యూస్(సెప్టెంబర్ 04):దౌల్తాబాద్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గోకఫస్లాబాద్‌లో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, దౌల్తాబాద్ మండల కేంద్రంలో రూ.4.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న జూనియర్ కళాశాల నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పటిష్టంగా పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నూతన సాంకేతికతను వినియోగిస్తూ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
*సీఎంకు ఘన స్వాగతం*
గోకఫస్లాబాద్ హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, డీఐజీ చందన దీప్తి, ఇన్‌చార్జ్ ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
*ప్రజలను ఆప్యాయంగా పలకరించిన సీఎం*
జూనియర్ కళాశాల పనులను పరిశీలించిన అనంతరం హనుమాన్ దేవాలయం వద్ద గుమికూడిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి పలకరించారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, కాడ అధికారి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, డీసీసీ కార్యవర్గ సభ్యులు జంగం వీరన్న, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ రావు, ఉప సర్పంచ్ సావిత్రమ్మ ఆశప్ప, మాజీ ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దస్తప్ప, సర్పంచ్ మల్లమ్మ, సర్పంచ్ రెడ్యానాయక్, రెడ్డి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.