విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్
సూర్య కరీంనగర్ ప్రతినిధి:కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో రేపు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యార్థుల, యువత సదస్సు ఏర్పాట్లను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండూరు రవీందర్‌రావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.