ప్రతి పేదవాడికీ వైద్యం అందాలి
ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి
ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి
- డాక్టర్ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో డివిపల్లిలో 43వ ఉచిత వైద్య శిబిరం
పామూరు, మేజర్ న్యూస్ : ప్రతి పేదవాడికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. మండలంలోని డివిపల్లి గ్రామంలోని రామాలయం కళ్యాణ మండపంలో శుక్రవారం ఎముకలు, కీళ్ల సమస్యలకు సంబంధించి 43వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
శిబిరంలో పాల్గొన్న వారికి ఎముకలు, కీళ్లకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 43 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు.