BREAKING
తీవ్ర సవాళ్లను దాటుకుని భారత్ నిలబడింది ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి... ‘యాప్ గురించి తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి’ వానలు పడాలని వేడుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు సోమవారం పనాజీలో ‘వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్’ 28వ సమావేశం ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీలో తొలి ‘ఐబ్రిక్స్ సదస్సు 2026’ ఢిల్లీలో 116 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌కు రాష్ట్ర పురస్కారాలు పాట్నా గాంధీ ఘాట్ వద్ద 'గరిష్ట ప్రమాద స్థాయి' దాటి ప్రవహిస్తున్న గంగ 1,344కు చేరిన మృతుల సంఖ్య.. 4,900 మంది గల్లంతు వరద ముప్పులో వారణాసి శాస్త్రీయ దృక్పథం, ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దాలి ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ తెలంగాణలో దంచికొడుతున్న ఉక్కపోత - కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలకు అవకాశం! ఎయిర్ ఇండియా కీలక చర్య - డ్రగ్స్ పరీక్షలో విఫలమైన పైలట్ ఉద్యోగం రద్దు!

‘యాప్ గురించి తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి’

Select Suryaa Now
‘యాప్ గురించి తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి’

చేగుంటలో మహిళా రైతు ఆవేదన
చేగుంట (మెదక్): "నాకు యూరియా యాప్ గురించి ఏమీ తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా, ఎట్లనైనా యూరియా ఇప్పించండి" అంటూ ఒక మహిళా రైతు మండల వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకున్న హృదయవిదారక సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

యూరియా బస్తాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేగుంటకు చెందిన నర్సవ్వ అనే మహిళా రైతు, శనివారం యూరియా కోసం వ్యవసాయ అధికారి వద్దకు వెళ్లి తన బాధను వెల్లబోసుకుంది. డిజిటల్ లేదా యాప్ విధానంలో యూరియా పొందే ప్రక్రియపై తనకు ఎలాంటి అవగాహన లేదని, పంట కాపాడుకోవడానికి ఎట్లయినా యూరియా ఇప్పించాలని కోరుతూ అధికారి కాళ్లపై పడింది.

ఈ సందర్భంగా నర్సవ్వ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తే ఇంటికే యూరియా బస్తాలు తెచ్చి ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు యూరియా కోసం ఇట్లా అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది" అని ఆవేదన చెందింది.

సామాన్య, నిరక్షరాస్య రైతులకు ఈ యాప్‌ల విధానం ఇబ్బందికరంగా మారిందని, క్షేత్రస్థాయిలో యూరియా పంపిణీని సులభతరం చేసి రైతులకు నేరుగా అందేలా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.