BREAKING
ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ తెలంగాణలో దంచికొడుతున్న ఉక్కపోత - కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలకు అవకాశం! ఎయిర్ ఇండియా కీలక చర్య - డ్రగ్స్ పరీక్షలో విఫలమైన పైలట్ ఉద్యోగం రద్దు! భార్యాభర్తల గొడవల్లో పోలీసుల జోక్యం తగదు - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు! ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) - క్లెయిమ్‌లు, అభ్యంతరాల కోసం నేడు, రేపు ప్రత్యేక ప్రచారం! నేపాల్ వరదలు: చిక్కుకుపోయిన భారతీయుల రక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు - వందలాది మంది గల్లంతైనట్లు MEA వెల్లడి! కోర్టుల్లో పెండింగ్ కేసుల మోతకు చెక్ - జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసు పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! కార్తీ మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం! ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ కాంబినేషన్ 'ఎపిక్' రిలీజ్ డేట్ ఖరారు - థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం! టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని 18 ఏళ్ల ప్రస్థానం: అసాధారణ ప్రయాణం, అంకితభావానికి ప్రతీక విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీ *ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలుడు కిడ్నాప్.. నిజామాబాద్‌లో కలకలం నిజామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, ఆన్‌లైన్ విధానం రద్దు చేయాలని డిమాండ్ ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! సీఎం చంద్రబాబుతో జేఏసీ భేటీ.. పీఆర్సీ, డీఏలపై ఉత్కంఠ సెప్టెంబర్ వానలకు బ్రేక్? ఖరీఫ్ పంటలపై పెరుగుతున్న ఆందోళన

ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ

Select Suryaa Now
ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ

గుంటూరులో సంచలనం సృష్టించిన బాలిక అపహరణ ఉదంతం సుఖాంతమైంది. మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి రాష్ట్రాలు మారుతూ తిరుగుతున్న కిడ్నాపర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన ఒకే ఒక్క మిస్డ్‌కాల్‌తో పోలీసులకు చిక్కాడు. పక్కా ప్రణాళికతో పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన షేక్‌ జాన్‌సైదా ఎట్టకేలకు పోలీసుల వలసలో చిక్కాడు.

అసలు ఏం జరిగిందంటే..

గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను జూన్ 9న షేక్‌ జాన్‌సైదా అపహరించాడు. ఈ కిడ్నాప్‌నకు ముందే నిందితుడు గుంటూరులోని ఓ లాడ్జిలో వారం రోజులు బస చేసి ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనుగోలు చేసి, వేరే వ్యక్తి పేరుతో సిమ్‌ కార్డులు సమకూర్చుకున్నాడు. వాటి ద్వారానే బాలికకు మెసేజ్‌లు పంపి ట్రాప్ చేశాడు. బాలిక ఇంటి నుంచి వెళ్లే సమయంలో తన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేసి మురుగు కాలువలో పడేసింది.

పోలీసుల కళ్లుగప్పి..

కిడ్నాప్ తర్వాత నిందితుడు సాధారణ ఫోన్ కాల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టాడు. దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను మాత్రమే నమ్ముకున్నాడు. ఈ క్రమంలో బాలిక మూడు ఇన్‌స్టా ఖాతాలు, జాన్‌సైదా ఏడు ఇన్‌స్టా ఖాతాలు మార్చారు. గుంటూరు నుంచి నెల్లూరు, చెన్నై, కోయంబత్తూరు, కేరళ, హైదరాబాద్‌ మీదుగా హరియాణా వరకు వివిధ ప్రాంతాలు మారుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో ఆశ్రయం పొంది, బంగారం విక్రయించేందుకు కూడా ప్రయత్నించారు. ఈ పరారీలో కొందరు స్నేహితులు, బంధువులు నిందితుడికి సహకరించినట్లు తేలింది.

హైకోర్టు ఒత్తిడితో వేగవంతమైన దర్యాప్తు..

బాలిక అదృశ్యంపై ఆమె తండ్రి ఇటీవల హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలను మరింత తీవ్రం చేశారు.

మిస్డ్‌కాల్‌ ఇచ్చిన కిలుకు మలుపు..

ఈ కేసులో గురువారం రాత్రి బాలిక ఇన్‌స్టా ఖాతా నుంచి తల్లిదండ్రులకు ఒక మిస్డ్‌కాల్ వచ్చింది. వెంటనే ఆ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఈ ఒక్క మిస్డ్‌కాల్‌ను ఆధారంగా చేసుకున్న పోలీస్ ఐటీ విభాగం.. నిందితుడి లొకేషన్‌ను ట్రేస్ చేసింది. హరియాణా రాష్ట్రం కర్నాల్‌ బుధాఖేరాలోని ఓ హోటల్‌లో వారు ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం.. హరియాణా పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం నిందితుడిని గుంటూరుకు తరలిస్తున్నారు. జాన్‌సైదాపై ఇప్పటికే పర్చూరు స్టేషన్‌లో ఒక దాడి కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.