BREAKING
పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కట్కూరి సత్యనారాయణరెడ్డి మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు డీఆర్డీవోలో రీసెర్చ్ ఉద్యోగాలు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ

మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు

Select Suryaa Now
మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు

ప్రధాని నరేంద్ర మోదీ సామాన్య ప్రయాణికులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రఖ్యాత శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆయన ఈ సాధారణ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఎంతో నిరాండంబరంగా మెట్రో స్టేషన్‌ వద్ద టికెట్ గేట్ దగ్గర స్మార్ట్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి మరీ ఆయన ప్రయాణం సాగించారు.  


మెట్రో కోచ్‌లోని ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, యువతతో ప్రధాని మోదీ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారి భవిష్యత్తు ఆకాంక్షల గురించి తెలుసుకున్నారు. ఒక చిన్నారి పుట్టినరోజు వేడుక గురించి తెలిసి ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలపగా, మరో బాలుడు ప్రధానితో సరదాగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. వీఐపీ భద్రతా వలయాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల మధ్య ప్రధాని ప్రయాణించిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో మెట్రో ప్రయాణాలను ఎంచుకున్న మోదీ, మరోసారి తన సరళ స్వభావాన్ని చాటుకున్నారు