కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కట్కూరి సత్యనారాయణరెడ్డి
సూర్య పెద్దపల్లి :భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా ఇన్‌చార్జి నాగపూరి రాజమౌళిగౌడ్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేష్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్తో పాటు జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాలో కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.