జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముంతాజ్ ఫాతిమా
సూర్య కరీంనగర్ ప్రతినిధి:ఉపాధ్యాయ దినోత్సవం–2026 సందర్భంగా కరీంనగర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం LMD ZPHS పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ముంతాజ్ ఫాతిమా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రభావశీల ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ, ఉత్తమ బోధన అందిస్తూ విద్యార్థుల్లో చక్కటి ప్రతిభను వెలికితీస్తున్నందుకు ఆమెను ఈ పురస్కారంతో సత్కరించారు. విద్యార్థులను భవిష్యత్ భారతదేశపు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ప్రశంసాపత్రం, పురస్కారాన్ని అందజేశారు.ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరుల చేతుల మీదుగా ముంతాజ్ ఫాతిమా అందుకున్నారు.