దగుల్బాజీ కేటీఆర్.. ఖబడ్దార్!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న…
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ కుయుక్తులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న అన్నారు. పదేళ్ల పాలనలో యువతకు జరిగిన అన్యాయాలకు కేటీఆర్ ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పేపర్ లీకేజీలు, 317 జీవో వంటి అంశాలపై యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. “కేటీఆర్.. ముందు గతాన్ని గుర్తు చేసుకో. ఆ తర్వాతే ప్రభుత్వాన్ని ప్రశ్నించు” అని నరసన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ఉద్యోగుల సమస్యలపైనా చర్చ జరుగుతుందని తెలిపారు.“ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. అక్కడే ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చిస్తుందని అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన యువ సమరభేరికి యువత నుంచి ఆశించిన స్పందన కనిపించలేదని అన్నారు.
బీఆర్‌ఎస్ నిర్వహించిన సభలు వరుసగా అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయని, ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు యువతను పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం రాజకీయ నాటకమేనని విమర్శించారు.“నాడు చేసిన మోసానికి ముందు యువతకు క్షమాపణ చెప్పాలి.. ఆ తర్వాతే నీతులు చెప్పాలి” అని నరసన్న అన్నారు. కేటీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ ప్రజలు, యువత వాటిని పట్టించుకోరని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న స్పష్టం చేశారు.