BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు

Select Suryaa Now
కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్‌లో ఆదివారం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్‌లోని సర్కస్ గ్రౌండ్ వరకు భారీ కార్మిక ర్యాలీ నిర్వహించి, అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ యూసుఫ్ అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటాలే మార్గమని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని, 8 గంటల పని విధానం సహా అనేక హక్కులు కార్మికుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే సాధించుకున్నామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి రంగంలో కార్మిక సంఘాలను బలోపేతం చేయాలని, సంఘాలు లేని రంగాల్లో కొత్త యూనియన్లు ఏర్పాటు చేసి కార్మికులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ, వైద్య, బ్యాంకింగ్, సేవారంగాలతో పాటు అంగన్‌వాడీలు, స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణ, పారిశుద్ధ్య, వంట కార్మికులు, ఉపాధ్యాయులు తదితర రంగాల్లో సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ కరీంనగర్ పోరాటాలకు, విప్లవాలకు కేరాఫ్ అడ్రస్ అని పేర్కొంటూ, కార్మికుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, వైద్య రంగాల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు, ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ప్యాట్రన్ కలవేన శంకర్, రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వి.ఎస్. బోస్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నర్సింహా, ఆఫీస్ బేరర్స్ ప్రేమ్ పావని, దేవేందర్‌రెడ్డి, విలాస్, ఇమ్రాన్, వెంకటేష్, శ్రీనివాస్, క్లైమేట్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, వివిధ జిల్లాల సీపీఐ కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, తాండ్ర సదానందం, చెన్న విశ్వనాథం, మంద సుదర్శన్, కరీంనగర్ జిల్లా నాయకులు పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, రమేష్, యుగేందర్, అంజలి తదితరులు పాల్గొన్నారు.