BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

మా కష్టాన్ని అవహేళన చేయొద్దు......

Select Suryaa Now
మా కష్టాన్ని అవహేళన చేయొద్దు......

మా కష్టాన్ని అవహేళన చేయొద్దు......
- ‘మెగా డిఎస్సీ' మా జీవితాల్లో వెలుగులు నింపింది
- విపక్షాల అనోసర అరోపణలతో మమ్మల్ని బాధ పెటొద్దు
- డిఎస్సీలో ఉద్యోగం పొందిన జిల్లావాసి అనిశెట్టి శారదా
- డిఎస్సీపై వైసిపి విష ప్రచారం మానుకోవాలి - కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర

ఒంగోలు రిపోర్టర్ :

మెగా డిఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయంటూ వైసిపి గొంతెత్తి నినదిస్తుంటే.... అదే స్థాయిలో కూటమి సర్కార్ డిఎస్సీ పారదర్శకంగా నిర్వహించామంటూ బదులిస్తుంది. 2018 సంవత్సరం నుండి డిఎస్సీ అభ్యర్థుల నిరీక్షణకు తెర దింపి కూటమి పాలనలో నిర్వహించిన డిఎస్సీపై వైసిపి విషం చిమ్మడం సిగ్గు చేటని ఛీదరించుకుటుంది. డిఎస్సీ పరీక్ష నుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ, ఉద్యోగాలు భర్తీ ఎంతో పారదర్శకంగా జరిగిందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంతో కష్టపడి చదివి డిఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు పొంది ఎంతో ఆనందంగా ఉన్నామని ఒక పక్క అభ్యర్థులు చెబుతుంటే... డిఎస్సీలో ఆక్రమాలు జరిగాయంటూ వైసిపి మాత్రం మాటల దాడి చేస్తునే ఉంది. డిఎస్సీలో ఉద్యోగం పొందిన ప్రకాశం జిల్లా వాసి చెబుతున్న మాటలు కన్నా వైసిపి నేతలకు కనువిప్పు కలుగుతుందేమో చూడాలి. 
మమ్మల్ని బాధ పెట్టొద్దు.....
- డిఎస్సీలో ఉద్యోగం పొందిన అనిశెట్టి శారదా
నా పేరు అనిశెట్టి శారదా. జిల్లావాసిని. కూటమి పాలనలో మెగా డిఎస్సీ -2025లో ఉద్యోగం పొందాను. బిసీ (బి) రిజర్వేషన్ ఉన్నా ఒపెన్ క్యాటగిరిలో ఉద్యోగం సాధించగలిగాను. మెగా డిఎస్సీలో మొత్తం ఉ ద్యోగాలు 16,345 ఉండగా సోషల్లో ప్రకాశం జిల్లాకు 106 పోస్టులు ఉన్నాయి. సంవత్సరం పాటు ఊరు, ఇంటిని వదిలి అవనగడ్డలో డిఎస్సీ కోచింగ్ తీసుకొని కష్టపడి సంవత్సరం పాటు చదివాను. ఈ 2025 నిర్వహించిన మెగా డిఎస్సీలో పరీక్ష వ్రాసి సోషల్లో ప్రకాశం జిల్లాలో 40వ ర్యాంకు సాధించగలిగాను. పరీక్ష నుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ, ఉద్యోగాల భర్తీ ఎంతో పారదర్శకంగా కొసాగింది. విపక్షాలు మాత్రం మెగా డిఎస్సీపై అనోసర, అసత్య విమర్శలు చేయడం చాలా బాధను కల్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సంవత్సం నుండి మెగా డిఎస్సీ కోసం ఎంతో ఎదురు చూశాము. వైసిపి ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన... తర్వాత 2025లో నిర్వహించిన మెగా డిఎస్సీ ఎంతో పారదర్శకంగా నిర్వహించారు. కాని విపక్షాలు మాత్రం అనోసర విమర్శలు, ఆరోపణలు చేయడం ఉద్యోగాలు పొందిన మాకు ఎంతో బాధను,
"ఆవేదనను కల్గిస్తుందని అన్నారు. ఇప్పటికైనా డిఎస్సీపై విపక్షాల విమర్శలు మానుకోవాలని డిఎస్సీలో ఉ ద్యోగం పొందిన అనిశెట్టి శారదా సూచించారు.
డిఎస్సీపై విష ప్రచారం మానుకోవాలి...
- కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
మెగా డిఎస్సీ - 2025 వలన ఎంతో మంది ఉద్యోగాలు పొంది సంతోషంగా ఉంటే వైసిపి మాత్రం డిఎస్సీపై విష ప్రచారం చేస్తుండటం సిగ్గుమాలిన చర్య అని కనిగిరి శాసన సభ్యులు, తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డా. ఉగ్ర నరసింహారెడ్డి మండిపడ్డారు. డిఎస్సీ పరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగాయని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులే స్వయంగా చెబుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే వైసీపీకి మాత్రం కనిపించడం లేదా....? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని డిఎస్పీపై విష ప్రచారం మానుకోవాలి. లేదంటే వైసిపి ప్రజలే మళ్లీ బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఉగ్ర హెచ్చరించారు.