కమ్మవారి సేవా సంఘం సామాజిక సేవలు అమోఘం
కమ్మవారి సేవా సంఘం సామాజిక సేవలు అమోఘం
- ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ
- పేద విద్యార్థులకు 35 లక్షల విలువచేసే చెక్కులతోపాటు, ల్యాప్ ట్యాపులు బాహూకరణ
కోటి, రిపోర్టర్ ఒంగోలు : అక్షర దానం కన్నా గొప్ప దానం మరొకటి ఉండదని, కమ్మ సామాజిక వర్గం లోని పేద విద్యార్థులకే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు ల్యాప్టాప్ లు బహుకరించటం గొప్ప కార్యక్రమం అని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు బైపాస్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు లాప్ ట్యాపు లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మీడియా,సోషల్ మీడియాలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం చేస్తున్న అనేక బృహత్తర కార్యక్రమాలు తనని ఎంతో ఇన్స్పైర్ చేసిందని అన్నారు. కోటి రూపాయలకు పైగా పేద విద్యార్థులకు సహాయం చేయడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ కాలికి బలపం కట్టుకొనిమరీ కమ్మ సామాజిక వర్గంలోని పెద్దలను కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతుండడం,వారికి అండగా నిలుస్తున్న సంఘ కార్యవర్గాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలియజేశారు. కమ్మవారి సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలలో తాను కూడా భాగస్వామిని అవుతానని ,నా వైపు నుండి ఆర్థిక సాయం ఎంతైనా ఇస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వన్ కే డోనర్స్ క్లబ్ అనే కాన్సెప్ట్ గొప్పదని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈ సేవా కార్యక్రమాలు పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతాయని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఎంతోమంది డోనర్స్ కార్యక్రమానికి స్పందించి సహాయం చేస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, సాయం పొందిన వారు భవిష్యత్తులో అభివృద్ధి చెంది ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని, ఈ సేవా యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఎన్నారై వింగ్ ఆస్ట్రేలియా అధ్యక్షులు ఎనికపాటి వెంకటేష్,నూజివీడు సీడ్స్ గ్రూప్ జనరల్ మేనేజర్ చింతమనేని ఏసుదాసు, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, కోశాధికారి మందాడి రాఘవరావు, వన్ కే డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు , పావులూరి పద్మజ గోగినేని శ్రీనివాసరావు కాట్రగడ్డ రఘుపతిరావు వడ్డంపూడి సుజాత రావు బొడ్డపాటి వెంకట్ మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి తదితరులు పాల్గొన్నారు ఇరవై మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎనిమిది లక్షల ఆర్థిక సహాయంతో కూడిన చెక్కులు, సుమారు 27 లక్షల రూపాయల విలువచేసే 43 ల్యాప్టాప్ లను 43 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంధాన కర్తగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు మండవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కమ్మవారి సేవా సంఘం సభ్యులు వన్ కే డోనర్స్ నెంబర్లు పాల్గొన్నారు.