పిట్ట కొంచెం కూత ఘనం.
పిట్ట కొంచెం కూత ఘనం.
కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచిన చిన్నారి.
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు సాధించిన బ్రహ్మణి చౌదరి.
ముండ్లమూరు, మేజర్ న్యూస్ : పిట్ట కొంచెం అన్న చందంగా కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కొర్రపాటి బ్రాహ్మణి చౌదరి చోటు దక్కించుకుంది. కర్నూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం ను నిర్వహించారు. టీ.జీ.వి కళాక్షేత్రం , శ్రీ నటరాజు నృత్య కళామందిర్ సంయుక్త నిర్వహణలో కూచిపూడి ,భరతనాట్యం, జానపద నృత్య ప్రదర్శనల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మందితెలుగు కళాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న చిన్నారి బ్రాహ్మణి చౌదరి అద్భుత ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించింది. చిన్ననాటి నుండి ఆ చిన్నారులోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు కోటేశ్వరరావు అర్చన హైదరాబాదులోని శ్రీ తరుణి కూచిపూడి కళానికేతన్ లో చేర్పించారు.సుప్రజ టీచర్ వద్ద కూచిపూడి నృత్యాన్ని బ్రాహ్మణి నేర్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగే కూచిపూడి నృత్య పోటీలలో బ్రాహ్మణి పాల్గొని తమ ప్రతిభను కనపరిచి మనలను పొందింది. కర్నూల్ లో జరిగిన పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి పలువురు. మన్నన లను పొందడంతోపాటు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ సి వెంకటాచారి జూరి మెంబర్ టీవీ అశోక్ కుమార్ చిన్నారి ప్రతిభను అభినందిస్తూ మెమెంటో ,ప్రశంసా పత్రం అందించి సన్మానించారు.