BREAKING
తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే! వినాయక చవితి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 14నా, 15నా? పండితులు ఏం చెబుతున్నారు? తెలంగాణకు వర్ష సూచన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు! పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత హిజ్రాల పేరుతో వసూళ్లు.. హైదరాబాద్‌లో అక్రమ దందాపై పోలీసుల ఫోకస్! పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అశ్వని కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం మిషన్ మోడ్‌లోకి భారతదేశపు మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం: అమిత్ షా శాంతి, ప్రకృతి సామరస్యాన్ని కాంక్షిస్తూ ప్రధాని మోదీ సంస్కృత శ్లోకం పోస్ట్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన IPOల హడావిడి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొత్త డిస్ట్రాయర్ అణు ప్రతిస్పందన వ్యవస్థలో భాగం వెస్ట్ బ్యాంక్‌లో సెటిలర్ అవుట్‌పోస్టుల తొలగింపునకు ఆదేశం

మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే!

Select Suryaa Now
 మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే!

పిల్లల పెళ్లి ఘనంగా చేయాలని, మంచి సంబంధం కుదరాలని కలలు కనే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తమది ప్రముఖ మ్యాట్రీమోనీ సంస్థ అంటూ నమ్మిస్తూ, భారీ వేతనం ఉన్న ఎన్‌ఆర్‌ఐ, డాక్టర్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అబ్బాయిలంటూ ఆకర్షణీయమైన ఫొటోలు, ప్రొఫైళ్లను వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు. అబ్బాయి నచ్చాడని చెప్పగానే అసలు ఆట మొదలుపెట్టే ఈ కేటుగాళ్లు.. రిజిస్ట్రేషన్ మరియు అబ్బాయి తల్లిదండ్రుల నంబర్ ఇవ్వడం కోసం అంటూ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అడ్వాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అమాయక తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదురుతుందన్న ఆశతో ఆ డబ్బులు పంపగానే, ఆ నంబర్లు స్విచ్‌ఆఫ్ చేయడం లేదా పూర్తిగా అందుబాటులోకి రాకుండా మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి నకిలీ మాటలతో ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్ ప్రాంతాల్లోని ఎంతోమంది తల్లిదండ్రులు నిండా మునుగుతున్నారు. కేవలం రూ.5 వేలు లేదా రూ.10 వేల చిన్న మొత్తమే కావడంతో చాలామంది బాధితులు పరువు పోతుందనే భయంతోనూ, పోలీసులకు వెళ్తే ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ, ఇదే అదునుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు వందల కొద్దీ కుటుంబాలను టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. బాధితుల ఫిర్యాదులు తక్కువగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ తరహా ఆన్‌లైన్ మోసాల బాధితుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే మ్యాట్రీమోనీ పేరుతో ఫోన్‌లు వచ్చే వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకూడదని సైబర్ నిపుణులు మరియు పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. సంస్థ పూర్తి వివరాలు, అధికారిక చిరునామాను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, గుర్తింపు లేని వ్యక్తిగత నంబర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ ద్వారా డబ్బులు జమ చేయకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మోసానికి గురైనా, వెంటనే సంబంధిత చాటింగ్ వివరాలు, ఫోన్ నంబర్లు, చెల్లింపు రసీదులతో సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.